రామంతపూర్‌‌లో రెచ్చిపోయిన మందు బాబులు | Road Side Liquor Party At Ramanthapur In Curfew Time | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ టైం: మెయిన్‌ రోడ్డుపై మందు పార్టీ

May 22 2020 9:42 AM | Updated on May 22 2020 10:02 AM

Road Side Liquor Party At Ramanthapur In Curfew Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో మందుబాబులు రెచ్చిపోయారు. కర్ఫ్యూ అంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా మెయిర్‌ రోడ్డుపై మందు పార్టీ చేసుకున్నారు. రామంతపూర్‌లోని టీవీ స్టూడియో ప్రధాన ద్వారం ముందు, పోలీస్‌ చెక్‌పోస్ట్‌కు కూత వేటు దూరంలో మందు​ బాబులు దర్జాగా పార్టీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మెయిన్‌ రోడ్డుపై కొందరు మందు పార్టీ చేసుకునేది పోలీసులు గమనించినా ప్రేక్షకపాత్రే వహించారని, సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే అప్రమత్తమైన పోలీసులు వారిపై పిటీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని స్థానికలు విమర్శిస్తున్నారు.  లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement