తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

Feb 15 2020 10:46 AM | Updated on Feb 15 2020 3:39 PM

Road Accident At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిగింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 




విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సు హల్‌చల్‌
నగరంలోని అజిత్‌సింగ్‌ నగర్‌ ఫ్లైఓవర్‌పై ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్‌ హల్‌చల్‌ చేశాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. బస్సు ఆపకుండా దూకుడుగా వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు 100కు డయల్‌ చేసి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఫ్లైఓవర్‌ దిగువన బస్సుసు ఆపి డ్రైవర్‌ను అజిత్‌సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement