ఆటోలో 20మంది.. డ్రైవర్‌ కాలికి చుట్టుకున్న పాము | road accident in gadwal 10 students injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

Feb 19 2018 11:38 AM | Updated on Mar 9 2019 4:28 PM

road accident in gadwal 10 students injured - Sakshi

సాక్షి, జోగులాంబ : గద్వాల జిల్లా అలంపూర్ మండలం, సింగవరం గ్రామం సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయాలయ్యాయి. సింగవరం గ్రామం నుంచి 20 మంది విద్యార్థులతో ఓ ఆటో మండల కేంద్రం అలంపూర్ బయలుదేరింది. మార్గ మధ్యలో ఓ పాము ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ ఆటో డ్రైవర్‌ కాలికి చుట్టుకుంది.

దీంతో డ్రైవర్‌ భయానికి గురయ్యాడు, ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్ధుల గురించి ఆందోళన అవసరం లేదని, స్వల్పగాయలు తగిలాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement