లాలూ కుమారుడి పెళ్లి.. అపశృతి | RJd Leaders Met An Accident After Returning From Lalu son Marriage | Sakshi
Sakshi News home page

లాలూ కుమారుడి పెళ్లి.. అపశృతి

May 13 2018 11:54 AM | Updated on Aug 30 2018 4:20 PM

RJd Leaders Met An Accident After Returning From Lalu son Marriage - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఎస్‌యూవీ వాహనం

పట్నా : లాలూ కొడుకు తేజ్‌ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ వివాహం ఆర్జేడీ సీనియర్‌ నేత చంద్రికా రాయ్‌ కూతురు ఐశ్వర్య రాయ్‌తో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కిషన్‌గంజ్‌ ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు అలమ్‌, మాజీ మంత్రి ఇస్లాముద్దీన్‌ బాగీ కుమారుడు ఇక్రాముల్‌ హక్‌, దిగల్‌బంక్‌ ఆర్జేడీ నేత పప్పు పాల్గొన్నారు. వేడుక అనంతరం పట్నా నుంచి కిషన్‌గంజ్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పొతీయా సమీపంలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో వీరితో పాటు కారు డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ఐడీ కార్డుల సహాయంతో వీరిని ఆర్జేడీ నేతలుగా గుర్తించారు. కాగా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement