
ప్రతీకాత్మక చిత్రం
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలోని జేకే గార్డెన్స్ ఎదురుగా ఉన్న «ధనలక్ష్మీ మొబైల్ షాపులో రిపేర్ చేస్తుండగా ఎంఐ స్మార్ట్‌ఫోన్ పేలిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి.
మొబైల్ షాపుకు కస్టమర్ రిపేర్ కోసం ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను షాపులో పనిచేసే రాకేష్ రిపేర్ చేసేందుకు ఫోన్ విప్పుతుండగా ఒక్కసారిగా వేడై పేలింది. కాగా ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదు. ఒక్కసారిగా సెల్‌ఫోన్ పేలిపోవడంతో షాపు యజమాని, వర్కర్, కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు.