మామిడి తోటలో రేవ్‌ పార్టీ | Rave Party in Mango Garden Karnataka 10 Arrest | Sakshi
Sakshi News home page

మామిడి తోటలో రేవ్‌ పార్టీ

Dec 9 2019 9:31 AM | Updated on Dec 9 2019 9:31 AM

Rave Party in Mango Garden Karnataka 10 Arrest - Sakshi

నిర్వాహకులను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై దాడి చేసిన రామనగర పోలీసులు 10 మందిని అరెస్టు చేసిన సంఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. రామనగర తాలూకా విభూధికెరె గ్రామం శివారులో ఉన్న మామిడి తోటలో చట్ట వ్యతిరేకంగా రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి చెందిన 32 ఎకరాల మామిడి తోటలో డీజే మ్యూజిక్‌తో శామియానాలు వేసి మరీ రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి బెంగళూరు, తమిళనాడు, కేరళ నుండి 500 మందికి పైగా యువతీయువకులు తరలివచ్చారు. వీరంతా ఒక యాప్‌ ద్వారా టిక్కెట్లు బుకింగ్‌ చేసుకున్నారని తెలిసింది.

అయితే రేవ్‌ పార్టీకి సంబంధించి నిర్వాహకులు ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్పీ అనూప్‌శెట్టి సిబ్బందితో కలిసి శనివారం అర్ధరాత్రి దాడి చేశారు.దాడిలో డీజే మ్యూసిక్‌ స్పీకర్లు,పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, మత్తు పదార్థాలు, కెమెరాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులయిన మధుమిత, పౌరాణిక్, పురోహిత్, నబిరా, రిచులతో కలిపి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement