నల్లగా ఉన్నావంటూ భర్త వేధించడంతో.. | Rajasthan Woman Humiliated By Husband Commits Suicide | Sakshi
Sakshi News home page

నల్లగా ఉన్నావంటూ భర్త వేధించడంతో..

Oct 29 2019 7:27 PM | Updated on Oct 29 2019 7:28 PM

Rajasthan Woman Humiliated By Husband Commits Suicide - Sakshi

నల్లగా ఉన్నావని భర్త తరచూ సూటిపోటి మాటలతో వేధించడంతో ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది.

రాజస్ధాన్‌ : నల్లగా ఉన్నావని తరచూ భర్త వేధిస్తుండటంతో పెళ్లయిన ఆరునెలలకే భార్య బలవన్మరణానికి పాల్పడింది. బాధిత మహిళను బన్సోయరా గ్రామానికి చెందిన 21 ఏళ్ల మంగీబాయ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుమార్తె మంగీబాయ్‌కు వివాహమైందని, పెళ్లయిననాటి నుంచి ఆమెను నల్లగా ఉన్నావని భర్త తరచూ వేధించేవాడని బాధితురాలి తండ్రి దేవ్‌లాల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మంగీబాయ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించామని, భర్త దినేష్‌ లోథాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement