ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య | prisioner suicide | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య

Jan 19 2018 6:27 PM | Updated on Nov 6 2018 7:53 PM

సాక్షి, హైదరాబాద్‌: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కుమ్మరి సత్యం అలియాస్ చిన్న సత్యంకు ఓ హత్య కేసులో పూనె కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఈ క్రమంలో అతను బాత్రూంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గత నెల 29న కూడా ఇతనికి ఇక్కడ చికిత్స చేయించారు. కాగా, గత ఏడాది మార్చి 9న మహారాష్ట్ర కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement