గర్భిణి హత్య కేసులో అమర్, వికాస్‌ అరెస్ట్‌

Pregnant woman murder case:Amarkanth arrested - Sakshi

హైదరాబాద్‌: గర్భిణి హత్య కేసులో నిందితుడు అమర్‌కాంత్‌ను బిహార్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ట్రాన్సిస్ట్‌ వారెంట్‌ పై ఇక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ను కూడా మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

మాదాపూర్‌లో తలదాచుకున్న వికాస్‌ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గర్భిణి బింగీ అలియాస్‌ పింకీ హత్యపై వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు. గర్భిణిని హతమార్చిన అనంతరం శరీర భాగాలను కోసేందుకు స్టోన్‌ కటింగ్‌ మిషన్‌ను అమర్‌కాంత్‌ కొనుగోలు చేశాడు. మమత ఝా బాల్కనీలో కాపలా ఉండగా బాత్‌రూమ్‌లో అమర్‌కాంత్, వికాస్‌ మిషన్‌తో గర్భిణి తల, కాళ్లు, చేతులు వేరు చేసి బస్తాల్లో మూట కట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మమత ఝా, అనిల్‌ ఝాను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వికాస్, అమర్‌కాంత్‌ను గురువారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Back to Top