వరంగల్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

Police Solved Warangal Women Murder Case - Sakshi

సినిమా ఫక్కీలో సాగిన హత్య

నిందితుడు జనగామ వాసిగా గుర్తింపు

వివరాలు వెల్లడించిన వరంగల్‌ సీపీ

సాక్షి, వరంగల్ : జిల్లాలో కలకలం రేపిన యువతి హత్యకేసును గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. వరంగల్‌లోని దీన్‌ దయాల్‌ నగర్‌కు చెందిన యువతి మానస బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లి హంటర్‌ రోడ్డులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషమం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్‌ కమిషనర్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీస్‌ కమిషనర్‌ వి. రవీందర్‌ మాట్లాడుతూ.. కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనగాం జిల్లా ఘన్‌పూర్‌ మండలం నెమలిగొండ్ల గ్రామానికి చెందిన పులి సాయిగౌడ్‌గా తెలిపారు. ‘నిందితుడు హంటర్‌రోడ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గురైన మానస హంటర్‌రోడ్డులోని నీలమ్‌ జంక్షన్‌ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే.. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం ఇరువురి  మధ్య పరిచయం ఏర్పడిందని, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు’ సీపీ పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయిగౌడ్ తనను కలిసేందుకు రమ్మని  చెప్పాడు. మానస భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి  బయటకు వచ్చింది. సాయి సూచన మేరకు మానస  కాజీపేట చేరుకోగా.. కారులో వచ్చిన సాయి   తనను తీసుకొని వెళ్లి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే మానసపై  హత్యాచారం చేసాడు. ఈ క్రమంలో మానస అక్కడికక్కడే మరణించడంతో ఆ హత్యా నేరం తనపై రాకుండా ఉండేందుకు తన మిత్రుల సహాయం కోరాడు. అనంతరం అక్కడికి చేరుకున్న నిందితుని మిత్రులు శవంగా పడి ఉన్న మానసను  చూసి సాయికి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో కంగారు పడ్డ సాయి ఒంటరిగానే మానస మృతిదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు శివారు ప్రాంతంలో తిరిగాడు.

అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు ఓ కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్‌ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్‌ రోడ్‌లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్‌ వద్ద రక్త సిక్తమైన మృతురాలి బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. అక్కడి నుంచి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు తిరిగి ఇంటికి రాలేదని కంగారు పడ్డ మానస తల్లిదడ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మానస తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడు సాయిగౌడ్‌ను గురువారం మద్యాహ్నం తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక నిందితుడి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోని కోర్టులో హాజరు పరుచనున్నట్లు సీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top