రిటైర్మెంట్‌ అయ్యాక మళ్లీ పెళ్లి

Police Officer Second Marriage After Retirement In Karnataka - Sakshi

పోలీసులు న్యాయం చేయడం

లేదంటూ మొదటి భార్య ఆవేదన

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఓ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి, భార్య బతికుండగానే మరో పెళ్లి చేసుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని వీవర్స్‌ కాలనీలో నివసిస్తున్న ఆనంద్‌ (65) రెండోపెళ్లి చేసుకున్న ఘనుడు. పోలీస్‌ అధికారిగా సేవలందించి రిటైర్డ్‌ అయిన ఆనంద్‌ 37 సంవత్సరాల క్రితం శోభ అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తదనంతరం శోభాను అనేక విషయాల్లో చిత్రహింసలకు గురిచేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.

వీరికి ఒక కూతురు ఉండగా ఆమెకు వివాహమై ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆనంద్‌ కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆనంద్‌ తనకు వంశోద్ధారకుడు కావాలని చెప్పి శోభ ఎంత చెప్పినా వినకుండా కొన్ని నెలల క్రితం చెప్పాపెట్టకుండా మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శోభ నెలమంగల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆనంద్‌పై చర్యలు తీసుకోవడంలేదని బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది. తనకు న్యాయం చేయాలని డిమాండు చేస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top