ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం | Perumalla Pranai murdered in Miryalaguda | Sakshi
Sakshi News home page

ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం

Sep 14 2018 3:42 PM | Updated on Sep 14 2018 5:03 PM

Perumalla Pranai murdered in Miryalaguda - Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్‌అప్‌ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు. అయితే భార్యను డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్‌కు గురైంది. దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.

అమృతని ప్రణయ్‌ ప్రేమవివాహం చేసుకోవడం యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారిద్దరూ ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. అమృత తండ్రి మారుతీ రావు మిర్యాలగూడలో పేరుమోసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్తితి సమీక్షించారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామన్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement