
సాక్షి, బనశంకరి: ఓ యువకుడు చేసిన వికృతచేష్టలకు కటకటాల పాలయ్యాడు. ఓ వ్యక్తి పక్కింటిలో ఉన్న బాత్‌రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మైకోలేఔట్ స్వారభౌమనగర్‌కు చెందిన జీవన్‌సెఠ్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉన్న మరో ఇంటి బాత్‌రూంలో కెమెరా అమర్చాడు.
ఉదయం స్నానాల గదిలోకి వెళ్లిన సదరు ఇంటి మహిళ కెమెరా ఉన్నట్లు గమనించి భర్తకు తెలిపింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మైకో లేఔట్ పోలీసులు జీవన్‌ను గురువారం అరెస్టు చేశారు.