ఆన్‌లైన్‌ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు | Person Cheated Amazon Company By Returning Fake Items In Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు

Feb 22 2020 2:10 PM | Updated on Feb 22 2020 2:17 PM

Person Cheated Amazon Company By Returning Fake Items In Online - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాల : ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. జాగిత్యాలకు చెందిన కట్ట అరుణ్‌ కాంత్‌, వేణుమాధవ్‌, మొహసిన్‌లు అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రూ. 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం వస్తువులు సరిగా లేవని అవి తీసేసి వాటి స్థానంలో నకిలీ వస్తువులను ఖాళీ డబ్బాల్లో పెట్టి అమెజాన్‌కు తిరిగి పంపించారు. కాగా అమెజాన్‌ ప్రతినిధులు తిరిగి వచ్చిన డబ్బాలను తెరిచి చూడగా నకిలీ వస్తువులు ఉండడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సెక్షన్‌ 406,420 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement