పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు | Paedophile Couple Jailed For 26 Years | Sakshi
Sakshi News home page

పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు

Jan 20 2020 6:37 PM | Updated on Jan 20 2020 6:43 PM

Paedophile Couple Jailed For 26 Years - Sakshi

భార్యను స్కూల్‌ డ్రెస్‌లో చూడాలనుకున్న టేలర్‌కు, స్కూల్‌ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది.

మాంచెస్టర్‌:  ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’
‘మీలో కీలి బుర్లింగమ్‌ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్‌ టేలర్‌ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్‌ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్‌ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ సెక్స్‌ అఫెన్స్, సెక్సువల్‌ అసాల్ట్‌ ఏ చైల్డ్‌ అండర్‌ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను.

అలాగే, పీటర్‌ టేలర్‌ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్‌ డ్రెస్‌ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్‌ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్‌ గర్ల్స్‌ మీదకు పీటర్‌ టేలర్‌ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్‌ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్‌ డ్రెస్‌లో చూడాలనుకున్న టేలర్‌కు, స్కూల్‌ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్‌ అఫెండర్స్‌ రిజిస్టర్‌ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్‌ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్‌లోని మిన్‌శుల్‌ స్ట్రీట్‌ క్రౌన్‌ కోర్టు జడ్జీ మార్క్‌ సావిస్‌ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు.

ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్‌లో గ్రేటర్‌ మాన్‌చెస్టర్‌లోని డుకిన్‌ఫీల్డ్‌కు చెందిన వారు. వారు 2016లో డేటింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది. అది కొద్ది కాలానికే పెడతోవలు పట్టింది. ముందుగా టేలర్‌ కామవాంఛ ఉద్దీపన కోసం ఇంటర్నెట్‌ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకొని బుర్లింగమ్‌కు పంపించే నీచానికి దాగాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాక స్కూల్‌ డ్రెస్‌తో మొదలైన తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునే దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్‌టైమ్‌ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్‌ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్‌ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట.

పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్‌ నెలలో టేలర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి సెల్‌ఫోన్లలో నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫొటోలు, షేర్‌ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది. (ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement