జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య | Old Man Committed Suicide | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

Jun 11 2018 5:59 PM | Updated on Oct 8 2018 5:07 PM

Old Man Committed Suicide - Sakshi

హన్మంతు మృతదేహం   

దేవరకద్ర రూరల్‌ మహబూబ్‌నగర్‌ : జీవితంపై విరక్తి చెంది ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ బాల్‌రెడ్డి కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం కౌ కుంట్ల చెందిన హన్మంతు (70) మూడేళ్లుగా స మీపంలోని ఓ గోదాంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కాగా, ఇటీవల అప్పు చేసి తన మనుమరాలి వివాహం జరిపించాడు. అంతేగాక కుటుంబ పోషణకు సైతం ఆయన అప్పు చేయాల్సి వచ్చింది.

వీటిని తీర్చే మార్గం లేకపోవడంతో మ నోవేదనకు గురై శనివారం రాత్రి తాను పని చే స్తున్న గోదాంలోనే పురుగుమందు తాగి చనిపోయాడు. ఈ సంఘటనపై ఆదివారం ఉదయం మృతుడి భార్య సరస్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మే రకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement