వృద్ధురాలి దారుణ హత్య | Old Lady Killed | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి దారుణ హత్య

Aug 7 2018 2:06 PM | Updated on Aug 7 2018 2:06 PM

Old Lady Killed  - Sakshi

ముత్తమ్మ (ఫైల్‌)

మోతె(కోదాడ) సూర్యాపేట : వృద్ధురాలిని గొంతునులిమి దా రుణంగా హత్య చేసి, ఆపై ఆమె దగ్గర ఉన్న నగదుతో పరారయ్యాడు నిందితుడు. ఈ సంఘటన మోతె మండలం నామవరం గ్రామంలో సోమవా రం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకా రపు ముత్తమ్మ(80) ఎద్దులను కొనుగోలు చేసేందుకు ఇటీవల అదేగ్రామంలో గుంటి పూలమ్మ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకుని దగ్గర పెట్టుకుంది.

ముత్తమ్మ ఇంటి ఎదురుగా ఉన్న దైద మహేందర్‌ అనే వ్యక్తి ముత్తమ్మ వద్ద డబ్బులు చూసి  డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈనెల 5న ముత్తమ్మ  చివ్వెం ల మండలంలో బండమీది చందుపట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో కర్మకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరాత్రి మహేందర్‌ ముత్తమ్మ ఇంట్లోకి జొరబడి రూ.30 వేలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు

గమనించిన ముత్తమ్మ అడ్డుకోబోగా ఆమెను గొంతునులిమి చంపి, డబ్బుతో పరారవుతుండగా.. ముత్తమ్మ కూతురు జానమ్మ చూసి ఇంట్లోకి వెళ్లి చూసింది. అప్పటికే ముత్తమ్మ మృతి చెందింది. ఇంట్లో రూ.17,500లు చిందరవందరగా పడి ఉండడంతో ముత్తమ్మ కూతురు ఇంటిపక్కల వారికి విషయం తెలిపి పోలీసులకు సమాచారం అందించింది. హత్య జరిగిన స్థలాన్ని మునగాల సీఐ శివశంకర్, కోదాడ టౌన్‌ సీఐ శ్రీని వాసరెడ్డి, మునగాల ఎస్‌ఐ నగేష్, మోతె ఏఎస్‌ఐ సందర్శించారు. ముత్తమ్మ హత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పాండునాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement