వృద్ధురాలి హత్య  | Old Lady Killed | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య 

May 7 2018 11:37 AM | Updated on May 7 2018 11:37 AM

Old Lady Killed - Sakshi

చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడు గ్రామంలో కుంజా సోమమ్మ(67)ను ఆమె సమీప బంధువు కుంజా లక్ష్మణ్, మద్యం మత్తులో హత్య చేశాడు. శనివారం రాత్రి ఇది జరిగింది. 
బెండాలపాడు గ్రామస్తుడు  వర్సా శ్రీను ఇంట్లో ఆయన కుమార్తె వివాహం జరుగుతోంది. ఈ వేడుకకు కుంజా సోమమ్మ, ఆమె ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చారు. వీరి బంధువు కుంజా లక్ష్మణ్‌ కూడా వచ్చాడు.

పెళ్లింటి వద్ద సోమమ్మ అల్లుడు జయరాజ్‌తో లక్ష్మణ్‌ ఘర్షణకు దిగాడు. లక్ష్మణ్‌ను సముదాయిస్తూ జయరాజ్‌ తన అత్త గారింటికి వచ్చాడు. అక్కడ కూడా మరింత రెచ్చిపోయాడు. ఎందుకు గొడవ పడుతున్నావని లక్ష్మణ్‌ను సోమమ్మ వారించింది. మద్యం మత్తులో అతడు, అక్కడే కంచెకు ఉన్న పెద్ద కర్రను తీసుకుని ఆమెపై మోదాడు. సోమమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. ఘటన స్థలాన్ని జూలూరుపాడు సీఐ రాయల వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. కేసును ఎస్‌ఐ కడారి ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement