
బనశంకరి : యువతులతో అశ్లీల నృత్యం చేయిస్తున్న ఓ పబ్‌పై జీవనబీమానగర పోలీసులు దాడిచేసి 32 మంది యువతులకు విముక్తి కల్పించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. లైవ్‌బ్యాండ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఇందిరానగర 80 పీట్‌రోడ్డులో ఉన్న మ్యాంగోట్రిపబ్‌లో గుట్టుగా అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. 32 మంది యువతులను కాపాడారు.
ఇది లా ఉండగా ఈ పబ్ శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారీష్ కుమారుడు మహమ్మద్‌నలపాడ్ స్నేహితుడైన హరీశ్‌కు చెందినదని సమాచారం. పోలీసుల దాడి నేపథ్యంలో నిర్వాహకులను అరెస్ట్ చేయకుండా మహమ్మద్‌నలపాడ్ సీనియర్ పోలీస్‌అధికారుల ద్వారా ఒత్తిడి చేసినట్లు సమాచారం.