బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు | A Non Cognisable Offence Registered Against Actor Aditya Pancholi | Sakshi
Sakshi News home page

బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు

Jan 22 2019 8:42 AM | Updated on Jan 22 2019 10:23 AM

A Non Cognisable Offence Registered Against Actor Aditya Pancholi - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు ఆదిత్య పంచోలి మీద నాన్‌ కాగ్నిజబుల్‌ నేరం నమోదయ్యింది. వివరాలు.. ఆదిత్య పంచోలి సర్విసింగ్‌ నిమిత్తం తన కార్‌ను 2017 మార్చ్‌లో ఓ మెకానిక్‌కి అప్పచెప్పాడు. సదరు మెకానిక్‌ సర్విసింగ్‌, రిపేర్‌ చేశాడు. ఇందుకు గాను రూ. 2.82 లక్షల బిల్లు అయ్యిందని.. ఆ డబ్బును చెల్లించాల్సిందిగా ఆదిత్యను కోరాడు. కానీ ఆదిత్య బిల్లు కట్టకుండా సదరు మెకానిక్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. బిల్లు కట్టమని అడిగిన ప్రతిసారి ఆదిత్య, మెకానిక్‌ను తిట్టడమే కాక వ్యక్తిగత బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.

కార్‌ సర్విసింగ్‌ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. నేటికి కూడా ఆదిత్య బిల్లు చెల్లించకపోవడంతో విసిగిపోయిన మెకానిక్‌ చివరకూ ముంబై వెర్సోవా పోలీస్‌ స్టేషన్‌లో ఆదిత్య మీద ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మెకానిక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిత్య పంచోలి మీద నాన్‌ కాగ్నిజబుల్‌ ఆఫెన్స్‌  కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతుంద’ని తెలిపారు. అయితే ఏ వ్యక్తి మీద అయిన నాన్‌ కాగ్నిజబుల్‌ ఆఫెన్స్‌ కేసు నమోదు అయితే వారెంట్‌ లేకుండా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేయకూడదు.

Advertisement
 
Advertisement
Advertisement