కోరిక తీర్చలేదని మైనర్‌ బాలుడిపై.. | Noida Woman Burns Minor Boys Genitals With Hot Tongs for Refusing Sex | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని మైనర్‌ బాలుడిపై..

Oct 10 2018 11:08 AM | Updated on Oct 10 2018 12:20 PM

Noida Woman Burns Minor Boys Genitals With Hot Tongs for Refusing Sex - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

మైనర్‌ బాలుడిపై పొరుగింటి మహిళ దారుణం..

న్యూఢిల్లీ : గ్రేటర్‌ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. తన కోర్కెను తీర్చలేదని 13 ఏళ్ల బాలుడి జననాంగాలను ఓ వివాహిత గాయపరిచిన ఘటన వెలుగుచూసింది. బదాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చప్రౌలా గ్రామంలో ఈ దారుణం జరిగిం‍దని పోలీసులు తెలిపారు. నిందితురాలు గత శుక్రవారం ఒంటరిగా ఉన్న సమయంలో తన పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిచి తన కోర్కెను తీర్చాలని బలవంతపెట్టిందని, బాలుడు నిరాకరించడంతో వేడి అట్లకాడతో జననాంగాలపై వాతపెట్టిందని పోలీసులు తెలిపారు.

బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం వంటి పలు సందేహాలపైనా విచారణలో దృష్టిసారిస్తామన్నారు. పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement