కాటేసిన కామాంధులు..! | Nizamabad Crime News Today | Sakshi
Sakshi News home page

కాటేసిన కామాంధులు..!

Jun 3 2019 10:09 AM | Updated on Jun 3 2019 10:09 AM

Nizamabad Crime News Today - Sakshi

కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లాలో కామాంధులు బరితెగించారు. అమాయక యువతులను టార్గెట్‌ చేసుకుని అఘాయిత్యాలకు ఒడి గట్టిన సంఘటనలు ఒకేరోజు రెండు చోట్ల వెలుగు చూశాయి. జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ మతిస్థిమితం లేని వికలాంగురాలిపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడగా ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మరో సంఘటనలో సదాశివనగర్‌ మండల లింగంపల్లి వద్ద ఓ యువతి అపస్మారక స్థితిక చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జరిగిన సంఘటనలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. విశ్వసనీయ, పోలీసుల సమచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

 జిల్లా కేంద్రంలోని ఓ రోడ్డులో.. 
జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో ఓ మతి స్థిమితం సరిగా లేని ఓ దివ్యాంగ మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. శనివారం రాత్రి భోజనం చేసి రోడ్డు పక్కనే నిద్ర పోతున్న ఆమెను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పక్కనే ఉన్న వర్క్‌షాపులోకి బలవంతంగా ఎత్తుకెళ్లి దాడి చేసి లైంగికదాడి చేసినట్లు తెలిసింది. స్థానికులు గమనించి ఒకరిని పట్టుకోగా మరొకరు పరారయ్యారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
 
లింగంపల్లి వద్ద... 
సదాశివనగర్‌ మండలం లింగంపల్లి వద్ద మరో ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తమ పంట పొలం వద్దకు వెళ్తున్నట్లుగా కొందరు పశువుల కాపరులు గమనించారు. అ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. యువతి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పశువుల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో గాలించారు.

కాళేశ్వరం కాలువ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం వేకువజామున సదురు యువతి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించి ఆమెను వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిగాని, లైంగికదాడి చేసిగాని ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయమై సదాశివనగర్‌ పోలీసులను సంప్రదించగా అపస్మారక స్థితిలో యువతిని గుర్తించినట్లుగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement