యువతికి నిప్పంటించిన కీచకుడు

NHRC notice to the Government of Bihar over killing of victim - Sakshi

బిహార్‌లో దారుణం

కోమాలో బాధితురాలు

పట్నా: బిహార్‌లో యువతిపై మరో అకృత్యం చోటుచేసుకుంది. అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించినందుకు 23 ఏళ్ల ఆ యువతికి ఓ కీచకుడు నిప్పంటించాడు. బిహార్‌లోని అహియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని వెంటనే ముజఫరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.  85 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ యువతి కోమాలో కొట్టుమిట్టాడుతోంది. గత మూడేళ్లుగా తమ కుమార్తెను నిందితుడు వేధిస్తున్నాడని ఆమె తల్లి చెప్పింది. తాజా ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్‌చేశారు. ఈ ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బిహార్‌ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు వివరాలను నాలుగు వారాల్లోగా తమకు తెలపాల్సిందిగా కోరింది. ఈ నోటీసులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలకూ పంపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top