‘మయూరి’ ఉపేంద్రవర్మ కేసులో కొత్త కోణం

New twist Mayur Pan shop owner Upendra Varma case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మయూరి పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్రవర్మ చేతిలో మోసపోయానంటూ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌) సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ను కలిశారు. తనకు జరుగుతున్న అన్యాయంతో పాటు తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో షికారు చేస్తున్న పుకార్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అదనపు సీపీ (నేరాలు) షికా గోయల్‌ను సైతం బాధితురాలు కలిశారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంపై సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈమె ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీటిని పోస్ట్‌ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మ సంబంధీకులు బాధితురాలికి వ్యతిరేకంగా మరికొన్ని ఫొటోలు విడుదల చేశారు. దీనిపై ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు: బాధితురాలు

‘ఉపేందర్‌తో గతేడాది సెప్టెంబర్‌ 13న వివాహం జరిగింది. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. న్యాయం కోసమే వారి ఇంటికి వెళ్లాను. ఆయన భార్యతో ఎలాంటి గొడవ పడలేదు. వారు ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. నేను అనేక మంది నుంచి డబ్బు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావు. నేను రూ. 40 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. వాళ్లు విడుదల చేసిన ఫొటోలు నా కాలేజ్‌ ఫ్రెండ్‌తో దిగినవి. అతడితో నాకు మొదట్లో అఫైర్‌ ఉండేది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో విడిపోయాం. కాలేజ్‌ ఫ్రెండ్‌ అనే ఉద్దేశంతో అతనితో చనువుగా ఉన్నా’ అని బాధితురాలు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top