స్నేహితులు తనతో మాట్లడం లేదని.. | NEET Student Commits End Lives in Chittoor | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Apr 29 2020 9:07 AM | Updated on Apr 29 2020 9:07 AM

NEET Student Commits End Lives in Chittoor - Sakshi

రంజిత(ఫైల్‌)

చిత్తూరు, కలకడ : మిత్రులు తనతో సక్రమంగా మాట్లడం లేదని మనస్తాపానికి గురైన విద్యార్థిని రంజిత(18) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కలకడ ఇందిరమ్మ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... ఇందిరమ్మకాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్యకార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమార్తె రంజితను విజయవాడలోని చైతన్య కళాశాలకు చెందిన భవిష్య క్యాంపస్‌లో నీట్‌ కోచింగ్‌కు పంపింది. లాక్‌డౌన్‌ కారణంగా రంజిత ఇంటికి చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో ప్యాన్‌కు ఉరి వేసుకుని, మరణించింది. తల్లి విధులు నిర్వహించుకుని  ఇంటికి వచ్చి, చూడగా కుమార్తె మరణించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement