యువతితో ఎఫైర్‌ : ప్రియుడిని చావబాదారు

Muslim Youth Beaten To Death Over Affair With Tribal Girl - Sakshi

అహ్మదాబాద్‌ : గిరిజన బాలికతో ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బాలికను ప్రేమిస్తున్నాడనే ఆగ్రహంతో 17 ఏళ్ల ముస్లిం యువకుడిని దుండగులు కర్రలు, పైపులతో చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన గుజరాత్‌లోని బరూచ్‌ జిల్లా జగదియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో పది మంది యువకులు పాలుపంచుకోగా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని అంక్లేశ్వర్‌ డిప్యూటీ ఎస్పీ ఎల్‌ఏ ఝలా తెలిపారు .

బాధితుడు ఫయజ్‌ తండ్రి రహీం ఖురేషి ఘటన గురించి వివరిస్తూ తమ కుమారుడు ఫయజ్‌ తన స్నేహితులతో కలిసి అంక్లేశ్వర్‌ వెళ్లాడని, తమను బొరిద్ర ప్రాంతానికి వచ్చి తనను కలుసుకోవాలని కోరగా, తాను అక్కడికి వెళ్లేసరికి దుండగుల దాడిలో తీవ్ర గాయాలతో ఉన్నాడని చెప్పుకొచ్చారు. సమీప ఆస్పత్రికి తరలించినా తమ కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయామని చెప్పారు. బొరిద్రలో గిరిజన బాలికతో ప్రేమ వ్యవహారం కారణంగానే ఫయజ్‌పై స్ధానికులు దాడికి తెగబడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తమ కుమారుడిని తీవ్రంగా కొట్టిన నిందితులందరిపై కఠిన చర్యలు చేపట్టాలని ఫయజ్‌ తల్లితండ్రులు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top