చంటి బిడ్డతో బావిలోకి దూకిన తల్లి | Mother Commits Suicide with Her Son in Vikarabad  | Sakshi
Sakshi News home page

చంటి బిడ్డతో బావిలోకి దూకిన తల్లి

Mar 10 2018 9:52 AM | Updated on Nov 6 2018 7:53 PM

Mother Commits Suicide with Her Son in Vikarabad  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలోని అత్తేల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి చంటి బిడ్డతో పాటు బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలివి.. మృతురాలి పేరు వరాలు. ఆమె స్వగ్రామం ఏక్మామిడి గ్రామం. మూడేళ్ల క్రితం అత్తేల్లి గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం అయింది. వీరికి 10 నెలల బాబు ఉన్నాడు.

భర్త వేధింపులే ఆమె మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. కోపంతో ఆమె చంటి బిడ్డతోపాటు బావిలోకి దూకేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి మృతదేహాలను తీసి పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement