తల్లీ కుమార్తె అదృశ్యం | Mother And Daughter Missing In Gajuwaka Centre Visakhapatnam | Sakshi
Sakshi News home page

తల్లీ కుమార్తె అదృశ్యం

May 14 2018 12:12 PM | Updated on May 14 2018 12:12 PM

Mother And Daughter Missing In Gajuwaka Centre Visakhapatnam - Sakshi

అంజలి, లియా (ఫైల్‌)

విశాఖ క్రైం, గాజువాక: స్థానిక వై జంక్షన్‌కు సమీపంలో గల నోవాస్‌ ఫ్లోరెన్స్‌ అపార్ట్‌మెంట్స్‌ నుంచి ఒక మహిళతోపాటు ఆమె రెండేళ్ల కుమార్తె అదృశ్యమైనట్టు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాం రాష్ట్రానికి చెందిన కస్టా బరుయాటీ డాక్టర్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నోవాస్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు.

ఈ నెల 11న రాత్రి అందరూ నిద్ర పోతున్న సమయంలో అతడి భార్య అంజలి సైకియా (26), తన రెండేళ్ల కుమార్తె లియాను తీసుకొని బయటకు వెళ్లిపోయింది. రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. అన్నిచోట్లా వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆమె గతంలో కూడా రెండు సార్లు ఇదే మాదిరిగా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్‌ బరుయాటీ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఎవరికైనా ఆచూకీ లభిస్తే 9440796014, 9440933764 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement