మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌ | most wanted red sander smuggler arrested in nellore district | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌

Nov 3 2017 11:58 AM | Updated on Oct 22 2018 1:59 PM

మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ వేగురి సురేంద్రబాబు పోలీసులకు చిక్కాడు.

సాక్షి, నెల్లూరు: మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ వేగురి సురేంద్రబాబు పోలీసులకు చిక్కాడు. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం నందిగుంట వద్ద ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.13 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, ఒక కారు, సెల్‌ఫోన్, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు దగదర్తి మండలం ప్యాడ్సన్‌పేటకు చెందినవాడు. సురేంద్రబాబుపై దోపడి, దౌర్జన్యం, కిడ్నాప్, హత్య సహా 20 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాతో సంబంధాలున్నాయని కలిగిరి సీఐ కరుణాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement