ఆ బంగారం ఎవరిది.? | Visakhapatnam Gold Smuggling Case, DRI Probes Hyderabad Jewellery Links After Seizing Gold Worth Crores | Sakshi
Sakshi News home page

ఆ బంగారం ఎవరిది.?

Oct 13 2026 1:10 PM | Updated on Oct 13 2026 1:41 PM

Huge Gold Seized In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: సినీఫక్కీలో విశాఖలో వలపన్ని భారీగా పట్టుకున్న బంగారం గుట్టు ఇంకా వీడలేదు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం స్వాదీనం చేసుకున్న బంగారం కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగవంతం చేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల గుండా కోల్‌కతాకు చేరిన ఈ బంగారాన్ని హైదరాబాద్‌కి తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు విశాఖలో పట్టుకున్న విషయం తెలిసిందే.  అయితే, ‘ఆ బంగారం ఎవరిది?‘ అనే కోణంలో అధికారులు ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతున్నారు.

 హైదరాబాద్‌లోని ఏ ప్రధాన జ్యువెలరీ వ్యాపారులు లేదా రిసీవర్ల కోసం ఈ భారీ స్మగ్లింగ్‌ జరిగిందన్న దానిపై డీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు చేసేందుకు పట్టుబడిన ఇద్దరు నిందితుల మొబైల్‌ ఫోన్లు, కాల్‌ డేటా రికార్డులను (సీడీఆర్‌) అధికారులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వారు ప్రయాణించిన రూట్‌ మ్యాఫ్లని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నిందితులు హైదరాబాద్‌లో ఎవరిని కలవాల్సి ఉంది..? ఈ దందాలో ఎవరి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతోంది.. తదితర కీలక లింకులను కనుగొనే పనిలో దర్యాప్తు బృందాలున్నాయి. 

మరోవైపు, అరెస్టయిన ఇద్దరు నిందితులను డీఆర్‌ఐ అధికారులు విశాఖపట్నంలోని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడానికి, హైదరాబాద్, కోల్‌కతా లింకులను పూర్తిగా ఛేదించడానికి వీలుగా.. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డీఆర్‌ఐ అధికారులు.. రెండు రోజుల్లో కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement