బాలికపై లైంగికదాడికి యత్నం | Molestation On Girl In Krishna | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి యత్నం

Aug 17 2018 1:39 PM | Updated on Aug 17 2018 1:39 PM

Molestation On Girl In Krishna - Sakshi

వివరాలు సేకరిస్తున్న ఏఎస్‌ఐ ప్రభాకరరావు, నిందితుడు బ్లూ రంగు టీషర్టులో ఉన్న వ్యక్తి మస్తాన్‌

వత్సవాయి(జగ్గయ్యపేట): మనుమరాలి వయస్సు ఉన్న ఒక బాలికపై 45 ఏళ్లు ప్రబుద్ధుడు లైంగికదాడికి యత్నించాడు.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటకు చెందిన ఎస్‌కే మస్తాన్‌ జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లుకు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. రోజుమాదిరిగానే జగ్గయ్యపేట బస్టాండ్‌ వద్ద ఆటో నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా జగ్గయ్యపేటకు చెందిన బాలిక (14) పెనుగంచిప్రోలులోని తన అమ్మమ్మ వద్దకు వెళ్లేందుకు ఆటోస్టాండ్‌ వద్దకు వచ్చింది. పెనుగంచిప్రోలు వరకు నేరుగా వెళ్లే ఆటో దొరకకపోవడంతో చిల్లకల్లు వరకు వెళ్తున్న మస్తాన్‌ ఆటో ఎక్కింది.

ఆటోలోని ప్రయాణికులు కొందరు చిల్లకల్లులో దిగారు. వారితోపాటు బాలిక దిగగా నేను పెనుగంచిప్రోలు వెళుతున్నాను ఎక్కు అని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకుని మస్తాన్‌ బయలుదేరాడు. మక్కపేట దాటిన తరువాత శింగవరం వెళ్లే డొంక రహదారిలోకి తీసుకువెళ్లి బాలికపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమెపై దాడిచేశాడు. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల పొలాల్లోని కొందరు  రైతులు అక్కడికి చేరుకుని మస్తాన్‌ను పట్టుకుని మక్కపేటకు తరలించారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో ఏఎస్‌ఐ ప్రభాకరరావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మస్తాన్‌కు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ పి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement