బాలికపై లైంగికదాడికి యత్నం | Molestation on Girl Child in Hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి యత్నం

May 10 2019 8:06 AM | Updated on May 10 2019 8:06 AM

Molestation on Girl Child in Hyderabad - Sakshi

నిందితుడు కృష్ణ

మల్లాపూర్‌: ఓ బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన కుటుంబం నగరానికి వలసవచ్చి, నాచారం ఎర్రకుంటలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా వారి రెండో కుమార్తె (06) ఇంట్లో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు కృష్ణ ఇంట్లోకి వెల్లి బాలికపై లైంగికదాడికి యత్నిచాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని కృష్ణను దేహశుద్ది చేసి నాచారం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement