వివాహిత స్నానం చేస్తుండగా మైనర్ ఘాతుకం.. | Minor Boy Arrested in Women Bathing Video Recording Case | Sakshi
Sakshi News home page

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

Mar 19 2019 8:45 AM | Updated on Apr 6 2019 9:01 PM

Minor Boy Arrested in Women Bathing Video Recording Case - Sakshi

బాలుడి అరెస్ట్‌ జువైనల్‌ హోంకు తరలింపు

చాంద్రాయణగుట్ట: ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన బాలుడిని ఛత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం జువైనల్‌ హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జంగమ్మెట్‌ ఆర్‌.ఎన్‌.కాలనీకి చెందిన వివాహిత  20 రోజుల నుంచి ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ బాలుడు(16)దీనిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి స్నేహితులకు పోస్ట్‌  చేశాడు. ఈ విషయం బాధితురాలి దృష్టికి రావడంతో ఆమె నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 16న ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆమె  ఛత్రినాక పీఎస్‌ ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపారు సోమ వారం బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement