తాండూరులో భారీ చోరీ | massive theft in tandur | Sakshi
Sakshi News home page

తాండూరులో భారీ చోరీ

Jan 28 2018 3:53 PM | Updated on Aug 11 2018 8:48 PM

massive theft in tandur - Sakshi

తీగలు కట్‌ చేసి ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

వికారాబాద్‌ : తాండూరు మండలం బెల్కటూరు గ్రామ సమీపంలోని పెన్నాకాలనీలో భారీ చోరీ జరిగింది. సుమారు ఎనిమిది ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. కాలనీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అలారం తొలగించి దుండగులు ఈ ప్రయత్నానికి ఒడిగట్టారు. చోరీ జరిగిన ఇళ్లను తాండూరు డిఎస్పీ రామచంద్రుడు, సీఐ సైదిరెడ్డి పరిశీలించారు. కొంత మంది బాధితులు హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్న వాళ్ల పిల్లల దగ్గర కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది బాధితులు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement