వివాహిత అదృశ్యం | Married Women Swaroopa Missing in Medak | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Jun 2 2020 8:00 AM | Updated on Jun 2 2020 8:00 AM

Married Women Swaroopa Missing in Medak - Sakshi

కుమ్మరి స్వరూప(ఫైల్‌)

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని దేవులపల్లిలో వివాహిత అదృశ్యమైనట్లు స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్‌ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి విఠ్లల్‌ కూతురు స్వరూప వివాహం ఎనగండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి పోచయ్యతో ఆరేళ్లక్రితం జరిగింది. ప్రస్తుతం ఒక కొడుకు ఉన్నారు. కాగా గత పదిహేను రోజుల క్రితం స్వరూప తల్లిదండ్రులను చూసేందుకు దేవులిపల్లి గ్రామానికి వచ్చింది. మే 30వ తేది అర్ధరాత్రి ఇంట్లోనుండి వెల్లిపోయింది. ఉదయం తండ్రిలేచి చూడగా ఇంట్లోలేదు. దీంతో చుట్టుపక్కల, బందువుల వద్దవెతికిన ఆచూకీలభించలేదు. దీంతో విఠల్‌ ఫిర్యాదు మేరకు స్వరూప అదృశ్యమైనట్లు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement