వేధింపులు తాళలేక సంధ్య ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి

Published Wed, Nov 6 2019 1:23 PM

Married Woman Commits Suicide in Kurnool - Sakshi

కర్నూలు ,దేవనకొండ: కట్టుకున్న భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని అలారుదిన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం పులికల్‌ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య కుమార్తె జంగం సంధ్య(20)ను అలారుదిన్నె గ్రామానికి చెందిన జంగం జగదీష్‌కు ఇచ్చి గతేడాది వివాహం చేశారు.  వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం భర్త జగదీష్‌ రోజూ సంధ్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన సంధ్య మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను భర్త, అత్తింటి వారే చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ మారుతి, తహసీల్దార్‌ దోనీఆల్‌ఫ్రైడ్‌ ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement