చెట్టుకు కట్టేసి..దారుణంగా కొట్టారు..

Man Tied To Tree Thrashed By Mob - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : మతిస్ధిమితం లేని వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిగా అనుమానిస్తూ కొందరు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తిని వైట్‌ఫీల్డ్‌కు సమీపంలో స్ధానికులు గుర్తించి పిల్లల్ని అపహరించేందుకు వచ్చాడని భావిస్తూ దాడికి దిగారు. ఆ వ్యక్తిని చెట్టుకు తాడుతో కట్టి దారుణంగా కొట్టారు. వ్యక్తిని చితకబాదుతూ తలపై గట్టిగా కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఐడీ కార్డు చూపాలని అతడిని హిందీలో ఓ వ్యక్తి అడగడం​కనిపించింది. మరికొందరు బాధితుడిని గేలి చేస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియోలో కనిపించారు.

స్ధానికుల దాడి నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు నెలల కిందట ఉత్తర కర్ణాటకలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పిల్లలను కిడ్నాప్‌ చేసే వ్యక్తిగా అనుమానిస్తూ స్ధానికులు చావబాదిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్‌ మీడియాలో వదంతుల ఆధారంగా మూక హత్యలు, దాడులను నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top