జీవితంపై విరక్తి చెంది.. | Man Suicide Due To Health Issues In Medak | Sakshi
Sakshi News home page

ఉరివేసుకొని యువకుడు మృతి

Sep 8 2018 4:41 PM | Updated on Nov 6 2018 8:08 PM

Man Suicide Due To Health Issues In Medak - Sakshi

గంగపురం శివాజీ

కోహీర్‌(జహీరాబాద్‌) : ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మద్రి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. ఏఎస్‌ఐ సంగమేశ్వర్‌ అందించిన సమాచారం ప్రకారం మద్రి గ్రామ నివాసి గంగపురం శివాజీ (25) ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకొని మృతిచెందాడు. శివాజీ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తల్లి తుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ సంగమేశ్వర్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement