ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య

Man Murdered By Lover In Punganuru Chittoor - Sakshi

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన నిందితుల అరెస్ట్‌

సాక్షి, పుంగనూరు(చిత్తూరు) : ప్రియుడి వేధిపులు తాళలేక మరొక ప్రియుడితో కలిసి అతన్ని ప్రియురాలు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. పుంగనూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పలమనేరు డీఎస్పీ అరీపుల్లా విలేకర్లకు తెలియజేశారు. పట్టణంలోని ఎంఎస్‌ఆర్‌ థియేటర్‌ ప్రాంతానికి చెందిన దంపతులు ఖాదర్‌బాషా, మల్లికా భాను. మల్లికాభాను ఖాదర్‌బాషాను వదిలివేసి షబ్బీర్‌ అనే అతనితో ఉంటోంది. అతడు చెడు అలవాట్లకు బానిసై నిత్యం ఆమెను వేధించేవాడు.

తన జల్సాలకు డబ్బుల కోసం ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేవాడు. దీంతో మల్లికాభాను తన మరో ప్రియుడు షేక్‌ చాంద్‌బాషాతో కలిసి గత నెల 21న షబ్బీర్‌ను హత్య చేసింది. షబ్బీర్‌ తాగిన మైకంలో ఇంట్లో నిద్రిస్తుండగా మల్లికాభాను, చాంద్‌బాషా కలిసి లుంగీని మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చాంద్‌బాషా బొలెరో జీపులో మండలంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరిపీచు వేసి, పెట్రోల్‌ పోసి కాల్చివేశాడు. కృష్ణాపురం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు గత నెల 29న పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో మృతదేహం షబ్బీర్‌ది అని, మల్లికాభాను ఆమె ప్రియుడు చాంద్‌బాషా కలిసి హత్య చేసినట్లు రుజు వైందని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఇరువురిని పట్టణ సమీపంలోని భగత్‌సింగ్‌కాలనీ వద్ద సీఐ మదుసూదనరెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఇరువురినీ రిమాండుకు తరలించామన్నారు.

చదవండి : యువకుడితో ఇద్దరు యువతుల పరారీ!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top