ప్రియురాలిని రైల్లోంచి తోసేసిన ప్రియుడు | Man Kills his Girlfriend in Karnataka | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని రైల్లోంచి తోసేసిన ప్రియుడు

Mar 22 2018 9:15 AM | Updated on Jul 30 2018 8:41 PM

Man Kills his Girlfriend in Karnataka - Sakshi

నీటిలో తేలుతున్న పూనమ్‌ మృతదేహం, (ఇన్‌సెట్లో) నిందితులు

సాక్షి, బెంగళూరు: వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ప్రేమికుడు తన ప్రేయసిని కదులుతున్న రైలు నుంచి తోసేసి చంపిన ఘటన బుధవారం కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన పూనమ్‌ (22) అనే యువతి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. అదే ఆసుపత్రిలో వైద్యునిగా పని చేస్తున్న సునీల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూనమ్‌ను లొంగదీసుకున్న సునీల్‌ వివాహ ప్రస్తావన తెచ్చే సరికి తప్పించుకోసాగాడు. ఆమె ఒత్తిడి తీవ్రతరం చేయడంతో పూనమ్‌ను అడ్డుతొలగించుకోవాలని తన తమ్ముడు సంజయ్‌తో కలసి కుట్రపన్నాడు. గోవా పర్యటనకు వెళదామంటూ మార్చ్‌15న పూనమ్‌ను తమ వెంట తీసుకెళ్లారు. మార్గమధ్యలోని బెళగావి జిల్లా అసోలి గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే సునీల్, సంజయ్‌తో కలసి పూనమ్‌ను రైలు నుంచి తోసేశాడు. బుధవారం నీళ్లలో తేలాడుతున్న యువతి మృతదేహం కనిపించడంతో ఖానాపుర పోలీసులు విచారణ జరిపి బుధవారం ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement