కలాసీ ఆత్మహత్య | Man Committed Suicide | Sakshi
Sakshi News home page

కలాసీ ఆత్మహత్య

Apr 12 2018 11:57 AM | Updated on Aug 29 2018 8:38 PM

Man Committed Suicide - Sakshi

తిరుపతిరావు మృతదేహం

సాలూరు: పట్టణంలోని రైల్వేస్టేషన్‌ వద్ద మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన ఎచ్చర్ల తిరుపతిరావు(45) బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లేవారు రైల్వేస్టేషన్‌ పైకప్పు కమ్మికి కొబ్బరితాడుతో వేలాడుతున్న తిరుపతిరావు మృతదేహాన్ని చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ ఎస్సై ఫకృద్దీన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి మృతుడు శివరాంపురం వాసిగా గుర్తించారు.

కొంతకాలంగా పట్టణంలోని బోనువీధిలో నివాసముంటూ తోపుడుబండిని లాగుతూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున టీ తాగేందుకు వెళ్లాడనుకున్నామని,  ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని భార్య, కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement