బ్యాంకు వద్ద మహిళకు టోకరా | Man Cheating Woman In Dena Bank Guntur | Sakshi
Sakshi News home page

బ్యాంకు వద్ద మహిళకు టోకరా

Jun 28 2018 1:46 PM | Updated on Aug 24 2018 2:36 PM

Man Cheating Woman In Dena Bank Guntur - Sakshi

బ్యాంకులో సీసీ ఫుటేజీని చూస్తున్న సీఐ శ్రీనివాసరావు, బాధితురాలు రమణమ్మ

వినుకొండ టౌన్‌: బ్యాంకుల వద్ద ఖాతాదారులను మాటల్లో ఉంచి ఆభరణాలు, నగదును దోచుకు పోయేవారు పెరిగిపోతున్నారు. నూజెండ్ల మండలం ఖమ్మపాడు గ్రామానికి చెందిన బొప్పుడి రమణమ్మ బంధువులతో కలసి పల్నాడ్‌ రోడ్డులోని దేనా బ్యాంకుకు బుధవారం వచ్చింది. ఖాతాలో రూ.5వేలను డ్రా చేసి రూ.4,500ను పర్సులో పెట్టుకుంది. దానిలో మూడు సవర్ల నల్లపూసల చైను కూడా ఉంది. పర్సును చేతిలో ఉన్న బుట్టలో వేసుకుంది. అదే సమయంలో బ్యాంకు ఆవరణలో ఓ వ్యక్తి వారి వెంటే ఉంటూ ధర్మం చేయమంటూ ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు.

అతని బారి నుంచి తప్పుకొని బట్టల షాపులోకి రమణమ్మ వెళ్లింది. అక్కడకు వెళ్లి బుట్టలో చూసుకోగా పర్సు కనిపించలేదు. ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ టీవీ శ్రీనివాసరావు బ్యాంకులో సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద ఆభరణాలు లేకపోవడం, అమాయకునిలా కనిపించడంతో వదిలి వేశారు. బుట్టలో నగదు, బంగారు ఆభరణం ఏమైనది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement