లైంగికదాడి కేసులో యువకుడి అరెస్ట్‌ | Man Arrest in Girl Child Molestation Case PSR Nellore | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో యువకుడి అరెస్ట్‌

Jan 24 2020 1:10 PM | Updated on Jan 24 2020 1:10 PM

Man Arrest in Girl Child Molestation Case PSR Nellore - Sakshi

మాట్లాడుతున్న సీఐ ఖాజావలీ

నెల్లూరు,తోటపల్లిగూడూరు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో యువకుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా కృష్ణపట్నం పోర్ట్‌ సీఐ ఖాజావలీ తెలిపారు. తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు మనుమసిద్ధినగర్‌కు చెందిన రాచగిరి విఘ్నేష్‌ ఓ బాలిక (14)తో పరిచయం పెంచుకున్నాడు. గత నెల 20వ తేదీన అతను ఆమెకు మాయమాటలు చెప్పి తోటపల్లిగూడూరు మండంలోని మండలంలోని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు విఘ్నేష్‌ను గురువారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement