న్యూడ్‌ ఫోటోలంటూ వేధింపులు, అభిషేక్‌ మళ్లీ అరెస్ట్‌ | Malkajgiri corporator son Abhishek Goud arrested again for Harassing Women | Sakshi
Sakshi News home page

న్యూడ్‌ ఫోటోలంటూ వేధింపులు, అభిషేక్‌ మళ్లీ అరెస్ట్‌

Nov 4 2017 3:57 PM | Updated on Sep 26 2018 6:09 PM

Malkajgiri corporator son Abhishek Goud arrested again for Harassing Women - Sakshi

హైదరాబాద్ ‌: కటకటాలు లెక్కపెట్టి వచ్చినా...మల్కాజిగిరి టీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీష్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌ బుద్ధి మారలేదు. మరోసారి తన పైత్యం ప్రదర్శించడంతో అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు మళ్లీ శనివారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.తన వద్ద మీ న్యూడ్‌ ఫోటోలు ఉన్నాయంటూ అభిషేక్‌ గౌడ్‌ ఇద్దరు యువతలను బెదరించాడు. దాంతో ఆ యువతులిద్దరు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా వారు అభిషేక్‌ గౌడ్‌ను అరెస్టు చేశారు.  కాగా గతంలోనూ అభిషేక్‌పై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు సృష్టించి.. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులు అందటంతో అతడిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అభిషేక్‌... వేధింపులకు విద్యార్థినులతో పాటు ఉద్యోగినులు గురయ్యారు. ఇతని వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యయత్నం కూడా చేశారు. అయితే మరికొందరు ఈ వేధింపులపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ఎట్టకేలకు అభిషేక్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement