రిమాండ్‌ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్‌ విచారణ  | Magistrate's trial on the death of a prisoner | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్‌ విచారణ 

Apr 11 2018 1:58 PM | Updated on Sep 2 2018 4:52 PM

Magistrate's trial on the death of a prisoner - Sakshi

విచారణ చేపడుతున్న శ్రీకాకుళం ఆర్డీఓ దయానిధి

టెక్కలి: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలికి చెందిన మాదిన  వల్లభరావు పాతపట్నం సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటూ మృతి చెందిన ఘటనకు సంబంధించి మంగళవారం టెక్కలి ఆర్డీఓ బి.దయానిధి కార్యాలయంలో మెజిస్టీరియల్‌ విచారణ చేపట్టారు.

వల్లభరావు పాతపట్నం సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటూ గత ఏడాది నవంబర్‌లో శ్రీకాకుళం రిమ్స్‌లో మృతి చెందాడు. ఈయన మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య లక్ష్మి, తమ్ముడు లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌ మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు.

దీంతో శ్రీకాకుళం ఆర్డీఓ  సమక్షంలో సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎం.శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం.అప్పారావు, పి.రామారావుతో పాటు మెళియాపుట్టి పోలీస్‌ సిబ్బంది ఎం.ఉమామహేశ్వరరావులను విచారించి వివరాలు సేకరించారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయంలో తదుపరి విచారణ  ఉంటుందని  ఆర్డీఓ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement