వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం | lovers commited suicide attempt | Sakshi
Sakshi News home page

వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం

Mar 8 2018 6:45 AM | Updated on Nov 6 2018 7:53 PM

lovers commited suicide attempt - Sakshi

ఆత్మహత్యాయత్నం చేసింది వీరే(కూర్చున్న వారు)

దమ్మపేట: ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సవలం ప్రసాద్‌కు, ఏపీలోని బుట్టాయిగూడెం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంతంతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆలస్యంగా సంతానం కలిగింది. ఇద్దరు కుమారుల్లో ఒకరు మృతిచెందారు. తరచూ తోటపల్లి వెళుతుండే ప్రసాద్‌కు అక్కడ ఓ వ్యక్తితో, అతని భార్యతో పరిచయం ఏర్పడింది.

ఆమెతో ప్రసాద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. తోటపల్లి సమీపంలో జాతర ఉత్సవాలకు వెళ్లిన ప్రసాద్, అక్కడి నుంచి తన బంధువులు ఉంటున్న రెడ్యాలపాడు కొమ్ముగూడెం గ్రామానికి విజయశాంతితో కలిసి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీకాంతం, తన భర్త ప్రసాద్‌ను మందలించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి ప్రసాద్‌ వెళ్లిపోయాడు.

విజయశాంతిని కొమ్ముగూడెం గ్రామానికి ప్రసాద్‌ తీసుకెళ్లాడని తెలుసుకున్న వెంటనే తోటపల్లి నుంచి విజయశాంతి తల్లి, భర్త, బంధువులు కలిసి కొమ్ముగూడెం వెళ్లారు. ఈ సమాచారమందుకున్న ప్రసాద్, విజయశాంతి.. బుధవారం మధ్యాహ్నం పురుగు మందు తాగారు. వారిని 108 సిబ్బంది దమ్మపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement