కొండమీద నుంచి దూకిన ప్రేమజంట | Karnataka: Lovers Attempt Suicide For Parents Not Accept Marriage | Sakshi
Sakshi News home page

కొండమీద నుంచి దూకిన ప్రేమజంట

Mar 26 2023 7:21 PM | Updated on Mar 26 2023 7:22 PM

Karnataka: Lovers Attempt Suicide For Parents Not Accept Marriage - Sakshi

దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకాలోని రామదేవరకొండ మీద ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులను పోలీసులు రక్షించారు. బెంగళూరు ఆర్‌ఎన్‌ శెట్టి కళాశాలలో ప్రథమ బీఈ విద్యార్థి చేతన్‌ (19), ఇదే కళాశాలలో ప్రథమ బీకాం చదువుతున్న విద్యార్థిని (19) శనివారం ఉదయం 11 గంటల సమయంలో కొండమీద నుంచి కిందకి దూకారు. అయితే అక్కడే చెట్లు, పొదల మధ్య చిక్కుకుని గాయాలపాలయ్యారు.

కాపాడాలని కేకలు వేస్తుండగా కొందరు గమనించి రామనగర రూరల్‌ పోలీసులకు కాల్‌చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని 3 గంటలపాటు శ్రమించి ప్రేమికులను కిందకు తీసుకువచ్చారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని వారు కొండ మీద నుంచి దూకారు. గాయపడ్డ ఇద్దరినీ రాజరాజేశ్వరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement