ప్రేమ విఫలమైందని విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Love Failure Young Man Commits Suicide Attempt In Krishan | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Nov 9 2018 12:20 PM | Updated on Nov 9 2018 12:20 PM

Love Failure Young Man Commits Suicide Attempt In Krishan - Sakshi

ఆస్పత్రిలో కోలుకుంటున విద్యార్థి సాయిరెడ్డి

కృష్ణలంక(విజయవాడ తూర్పు): ప్రేమ విఫలం అయిందని మనస్తాపానికి గురైన విద్యార్థి చదువుకుంటున్న కళాశాలలోనే తరగతి గదిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు అప్రమత్తంతో విద్యార్థినిని రక్షించారు.  వివరాలు.. మోహబూబాబాద్‌కు చెందిన సాయిరెడ్డి(21) లబ్బిపేటలోని పైడయ్యవీధిలోని సీఎంఎస్‌ సీఏ అకాడమిలో సీఏ చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే కళశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. ఆమెకు తెలియజేయడంతో అందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం స్నేహితులకు చెప్పి  కత్తి తీసుకుని కళాశాలలోని ఒక తరగతి గదిలోకి దూరి ఎవరు రాకుండా బెంచ్‌లు అడ్డుపెట్టుకున్నాడు.

100కి సమాచారం అందించడంతో అక్కడే విధులు నిర్వరిస్తున్న కృష్ణలంక ఎస్‌ఐ చినబాబు, విద్యార్థికి నచ్చచెప్పందుకు ప్రయత్నిస్తున్నా వినలేదు. ఎస్‌ఐ గంటన్నరపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రెండు సార్లు మెడపై కోసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విద్యార్థిని పట్టుకుని చేతిలోని కత్తిని వదిలించి తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని పోలీసు వాహనంలోనే దగ్గరగా ఉన్న వైవీ రావు ఆస్పత్రికి తరలించగా అక్కడ సిబ్బంది సకాలంలో స్పందించక పోగా మరో ఆస్పత్రికి తరలించేందుకు వారి వద్ద అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ను కూడా అందించకపోవడంతో గత్యతరం లేని పరిస్థితిలో పోలీసులే వారి వాహనంలో ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement