ప్రేమ విఫలమైందని..

Love Failure Man Suicide Attempt Infront Lover House Mahabubnagar - Sakshi

ప్రియురాలి ఎదుట ప్రియుడి ఆత్మహత్యాయత్నాం

జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

జిల్లాకేంద్రంలో కలకలం

మహబూబ్‌నగర్‌ క్రైం: తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిప్పంటించు కోవడంతో క్షణాల్లో మంట లు చెలరేగి శరీరం పూర్తిగా కాలింది. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా.. హైదరాబాద్‌లోని బొరబండ సంజయ్‌నగర్‌కాలనీకి చెందిన భాస్కర్‌ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతి అదే కళాశాలలో మొదటి ఏడాదిలో చేరింది. అయితే యువతి తన ప్రేమను నిరాకరించడంతోపాటు నిర్లక్ష్యం చేస్తుందని గురువారం సాయంత్రం ఆమె ఇంటి దగ్గరికి చేరుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో దాదాపు 95 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరం నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నామని, ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్‌ మీడియాకు వెల్లడించాడు. సోమవారం అమ్మాయి వాళ్ల బాబాయి తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని ఆరోపించారు. వాళ్ల పెద్దల మాటలు విని అమ్మాయి తన ప్రేమను నిరాకరిస్తుందని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇదే విషయమై యువతి బాబాయి ‘సాక్షి’తో మాట్లాడుతూ భాస్కర్‌ కొన్నిరోజుల నుంచి ప్రేమించా లని తమ అమ్మాయిని వేధిస్తుండటంతో ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో నచ్చజెప్పి వచ్చామన్నారు. గురువారం సాయంత్రం వచ్చి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ విషయమై  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top