ప్రేమ విఫలమై హిజ్రా ఆత్మహత్య | Love Failure Hijra Commits Suicide in Tamil nadu | Sakshi
Sakshi News home page

హిజ్రా ఆత్మహత్య

Jan 8 2020 9:54 AM | Updated on Jan 8 2020 9:54 AM

Love Failure Hijra Commits Suicide in Tamil nadu - Sakshi

చెన్నై,అన్నానగర్‌: ఈరోడ్‌ సమీపంలో మంగళవారం ప్రేమ ఓటమి వల్ల హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్‌ సమీపం మూలప్పాలైయమ్‌ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్‌ అనే సుస్మితా (22) హిజ్రా. ఈమె తన అమ్మ చిన్నపొన్నుతో నివసిస్తూ వచ్చింది. సుస్మితాకి, ఈరోడ్‌ వీరప్పన్‌ చత్రమ్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత సుస్మితా ఆ యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. అనంతరం సుస్మితా, ఆ యువకుడి వద్ద తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.

కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందువల్ల సుస్మితా కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఎవరు ఇంట్లో లేని సమయంలో సుస్మితా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్నిచూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి, స్థానికుల సహాయంతో రక్షించి చికిత్స కోసం ఈ రోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్క డ పరిశోధన చేసిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement